నాదెండ్ల లో నిర్వహించిన జాతీయ పోషణ మాసం, స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, టీడీపీ నాయకురాలు నాగమల్లేశ్వరి, హెచ్‌డీఎస్ ప్రసన్న కుమారి పాల్గొన్నారు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం, పౌష్టికాహార లోపం నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కార్యక్రమంలో వివరించారు
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని సూచించారు
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, అవసరమైన వైద్య సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు
పౌష్టికాహారం, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు
ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచాలని పిలుపునిచ్చారు
ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని తెలిపారు


