సత్తుపల్లి / ఖమ్మం
సత్తుపల్లి విరాట్‌నగర్ కాలనీ సమీపంలో, సింగరేణి జీఎం కార్యాలయం ఎదురుగా సింగరేణి సంస్థ సౌజన్యంతో నిర్మించిన ఆరు మినరల్ వాటర్ ప్లాంట్లను వెంటనే ప్రారంభించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్లాంట్లు ప్రారంభానికి నోచుకోకుండా నిరుపయోగంగా ఉండటం బాధాకరమన్నారు. ఇవి అందుబాటులోకి వస్తే విరాట్‌నగర్, వెంగళరావునగర్, జలగంనగర్, ద్వారకాపురినగర్ కాలనీల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని తెలిపారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. బీజేపీ సత్తుపల్లి పట్టణ అధ్యక్షులు భానోత్ విజయ్ ఆధ్వర్యంలో జరిగిన పర్యటన లో పట్టణ ప్రధాన కార్యదర్శి మందా శివ, మాజీ మండల అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు తెనాలి అశోక్, పట్టణ ప్రధాన కార్యదర్శి మందా సందీప్ పాల్గొన్నారు.



