పున్నమి న్యూస్ సూళ్లూరుపేట
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో పేదల చిరకాల స్వప్నం నెరవేరింది. సూళ్లూరుపేట పట్టణంలో నిర్మించిన టిడ్కో (TIDCO) గృహాలను గురువారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఘనంగా ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయశ్రీ హాజరై, లబ్ధిదారులకు గృహాల తాళం చెవులు అందజేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి గృహ సముదాయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను గాలికి వదిలేసిందని,కూటమి ప్రభుత్వం వచ్చాక యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి పేదలకు అందిస్తున్నాం అని,ఇది కేవలం ఇల్లు కాదు, పేదవాడి ఆత్మగౌరవం. చంద్రబాబు నాయుడు ఆశయం ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేదే అని అన్నారు.
సొంత ఇల్లు వచ్చిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అన్ని మౌలిక వసతులతో నిర్మించిన ఈ గృహాలు తమ జీవితాల్లో వెలుగులు నింపాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే పరసారత్నం, సుధాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, మున్సిపల్ చైర్మన్, టిడ్కో అధికారులు, కూటమి నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


