తమ్మెర పాపిరెడ్డి మృతి.. నున్నా రవికుమార్ సంతాపం
రజనీ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పాలేరు బీజేపీ ఇన్చార్జి
తిరుమలాయపాలెం: బీజేపీ ఖమ్మం జిల్లా కార్యదర్శి తమ్మెర రజనీ రెడ్డి భర్త తమ్మెర పాపిరెడ్డి అకాల మరణం చెందారు. ఆయన మృతికి పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన, ప్రస్తుత బీజేపీ పాలేరు ఇన్చార్జి నున్నా రవికుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
పాపిరెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నున్నా రవికుమార్.. రజనీ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో వారికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ, పాపిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
పాపిరెడ్డి అంత్యక్రియలు గురువారం తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామంలోని ఆయన స్వగృహంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.



