వార్త ముఖ్యాంశాలు
- సీతానగరం: మండలంలోని వేగటివలస సమీపంలోని తోటపల్లి కుడి కాలువలో సెప్టెంబర్ 22న కాలుజారి గల్లంతైన వ్యక్తి కోసం అగ్నిమాపక సిబ్బంది చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో బుధవారం మృతదేహం లభ్యమైంది.
- మంగళవారం నుంచి గాలింపు చేపట్టిన సిబ్బంది, బుధవారం ఉదయం 6 గంటలకు తిరిగి ఆపరేషన్ ప్రారంభించారు.
- గ్రామస్థుల సహకారంతో ముమ్మరంగా గాలింపు చేపట్టగా ఉదయం 11.30 గంటలకు మృతదేహాన్ని గుర్తించారు.
సీతానగరం: మండలంలోని వేగటివలస సమీపంలోని తోటపల్లి కుడి కాలువలో సెప్టెంబర్ 22న కాలుజారి గల్లంతైన వ్యక్తి కోసం అగ్నిమాపక సిబ్బంది చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో బుధవారం మృతదేహం లభ్యమైంది. మంగళవారం నుంచి గాలింపు చేపట్టిన సిబ్బంది, బుధవారం ఉదయం 6 గంటలకు తిరిగి ఆపరేషన్ ప్రారంభించారు. గ్రామస్థుల సహకారంతో ముమ్మరంగా గాలింపు చేపట్టగా ఉదయం 11.30 గంటలకు మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. రెస్క్యూ ఆపరేషన్‌ను అగ్నిమాపక విపత్తుల అధికారి జి. ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు.