‘నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే’.. SIRపై ఈసీ క్లారిటీ
భారత ఎన్నికల సంఘం (ECI) తన నిర్ణయాలపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల ఏకాభిప్రాయంతోనే లేదా మెజారిటీ సంతకాలతోనే ఈసీ నిర్ణయాలు అమలవుతాయని స్పష్టం చేసింది. ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ప్రక్రియలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను కమిషన్ వర్గాలు తోసిపుచ్చాయి. ఈసీ నిర్ణయాలన్నీ పారదర్శకంగా, అందరి అభిప్రాయాలతోనే జరుగుతాయని తెలిపింది.

నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే. SIRపై ఈసీ క్లారిటీ
‘నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే’.. SIRపై ఈసీ క్లారిటీ భారత ఎన్నికల సంఘం (ECI) తన నిర్ణయాలపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల ఏకాభిప్రాయంతోనే లేదా మెజారిటీ సంతకాలతోనే ఈసీ నిర్ణయాలు అమలవుతాయని స్పష్టం చేసింది. ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ప్రక్రియలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను కమిషన్ వర్గాలు తోసిపుచ్చాయి. ఈసీ నిర్ణయాలన్నీ పారదర్శకంగా, అందరి అభిప్రాయాలతోనే జరుగుతాయని తెలిపింది.

