ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపురం మండల కేంద్రంలో జరిగిన
గణేష్ నవరాత్రి ఉత్సవాల అనంతరం నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, సర్పంచ్ దాసరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. యువత, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణేష్ నామస్మరణలతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.



