Thursday, 24 September 2026
  • Home  
  • డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా. మాజీ ఎంపీ చింతా అనురాధ
- ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా. మాజీ ఎంపీ చింతా అనురాధ

పి. గన్నవం నుండి పున్నమమి ప్రతినిధి. సెప్పెంబర్ 23.డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై న్యాయమైన విచారణ జరిపించాలని ప్రశ్నించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేయడం, తాజాగా 51 మందిపై రౌడీషీట్లు తెరవాలని పోలీసులకు ఆదేశాలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ అన్నారు.డీఎస్సీ నియామకాల్లో పారదర్శకతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో వాటికి సమాధానాలు చెప్పాల్సిన కూటమి ప్రభుత్వం,ఆ అంశాన్ని ప్రశ్నిస్తున్న వారిపై పోలీసు కేసులు,రౌడీషీట్లతో భయపెట్టే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె అన్నారు.విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ అంశంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన అనంతరం కేసులు నమోదు చేయడం,పలువురిపై కఠిన చర్యలకు ఉపక్రమించడం ద్వారా అసలు సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని అనురాధ పేర్కొన్నారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించడం,నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కులని,ఆ హక్కులను కాలరాయకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరించాలని అనురాధ అన్నారు.కూటమి ప్రభుత్వం పోలీసు చర్యలతో ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతులను అణచివేయడం కాకుండా, డీఎస్సీ నియామకాలపై ఉన్న అనుమానాలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని చింతా అనురాధ డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.