Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

చాగలేరు సచివాలయం తనిఖీ – స్వచ్ఛ రథంపై అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చాగలేరు సచివాలయం తనిఖీ – స్వచ్ఛ రథంపై అవగాహన

పున్నమి న్యూస్ ప్రతినిధి
(సెప్టెంబర్ 23):
వేముల: చాగలేరు గ్రామ సచివాలయాన్ని బుధవారం అధికారులు తనిఖీ చేశారు. అనంతరం గ్రామంలో స్వచ్ఛ రథం, బిన్ బ్యాగ్ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

వేముల, చాగలేరు గ్రామ పంచాయతీల పరిధిలో స్వచ్ఛ పథం కార్యక్రమంలో భాగంగా గ్రీన్ అంబాసిడర్ల ద్వారా తడి, పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని వివరించారు. తడి చెత్తను బిన్‌లో, పొడి చెత్తను ప్రత్యేక బ్యాగ్‌లో వేసి అందించాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పొడి చెత్తను స్వచ్ఛ రథానికి అందిస్తే, అందుకు బదులుగా అవసరమైన నిత్యావసర వస్తువులను పొందవచ్చని తెలిపారు.

వర్షాకాలం నేపథ్యంలో గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని కాచి చల్లార్చి తాగాలని ప్రజలకు సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి అందించడం ద్వారా స్వచ్ఛ గ్రామాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

చాగలేరు సచివాలయం తనిఖీ – స్వచ్ఛ రథంపై అవగాహన

చాగలేరు సచివాలయం తనిఖీ – స్వచ్ఛ రథంపై అవగాహన

చాగలేరు సచివాలయం తనిఖీ – స్వచ్ఛ రథంపై అవగాహన

చాగలేరు సచివాలయం తనిఖీ – స్వచ్ఛ రథంపై అవగాహన

చాగలేరు సచివాలయం తనిఖీ – స్వచ్ఛ రథంపై అవగాహన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *