உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
கடப்பா

సేంద్రియ వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారీ

புன்னமி செய்தியறை வெளியீடு:
సేంద్రియ వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారీ

(పున్నమి ప్రతినిధి)వేముల, అక్టోబర్ 7: వేముల మండలంలోని గ్రామ పంచాయతీల్లో సేంద్రియ వ్యర్థాలను సద్వినియోగం చేసుకుని నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారు చేయడంలో భాగంగా నల్లచెరువుపల్లి, చింతల జూటూరు, పెద్ద జూటూరు గ్రామ పంచాయతీల్లోని SWPCలలో వర్మీ కంపోస్ట్ తయారీ ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా సిద్ధం చేసిన వర్మీ తొట్లలో వానపాములను వదిలారు.

వర్మీ తొట్లలో పశువుల పేడ, సేంద్రియ వ్యర్థాలను తగిన పద్ధతిలో వినియోగించి వానపాముల సహాయంతో నాణ్యమైన సేంద్రియ ఎరువును తయారు చేయనున్నారు. తద్వారా గ్రామాల్లో ఉత్పత్తయ్యే సేంద్రియ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు రైతులకు ఉపయోగపడే సేంద్రియ ఎరువు అందుబాటులోకి రానుంది.

వర్మీ తొట్ల నిర్వహణ, తేమ పరిరక్షణ, వానపాముల సంరక్షణ తదితర అంశాలపై సిబ్బందికి సూచనలు అందించారు. గ్రామాల్లో సేంద్రియ వ్యర్థాలను వేరుచేసి అందించడం ద్వారా వర్మీ కంపోస్ట్ తయారీకి ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, డీవై ఎంపీడీఓ, పీడీఓలు, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.

సేంద్రియ వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారీ

సేంద్రియ వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారీ

సేంద్రియ వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *