తిరుమలాయపాలెం పోలీస్
వినాయక నిమజ్జన ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు
తిరుమలాయపాలెం: వినాయక నిమజ్జనం సందర్భంగా మండల ప్రజలు, మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు శాఖ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై కూచిపూడి జగదీష్ కోరారు.
నిమజ్జన ఊరేగింపులో డీజేలు, అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టమ్‌లను వినియోగించరాదని స్పష్టం చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిమజ్జనం నిర్వహించాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించి డీజేలు, అధిక శబ్ద పరికరాలు వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
— కూచిపూడి జగదీష్, ఎస్సై, తిరుమలాయపాలెం


