Wednesday, 23 September 2026
  • Home  
  • జి కొండూరు మండలంలో అభివృద్ధి పనులు శ్రీకారం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్
- ఎన్ టి ఆర్ జిల్లా

జి కొండూరు మండలంలో అభివృద్ధి పనులు శ్రీకారం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్

జి.కొండూరు మండలంలో రూ.1.67 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, జి.కొండూరు మండలంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రూ.1.67 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శంకుస్థాపనలు చేసి, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తొలుత జి.కొండూరు మండలం పినపాక గ్రామంలోని ఎస్సీ ఏరియాలో రూ.25 లక్షల డీఎంఎఫ్ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవనానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు శంకుస్థాపన చేశారు. ఆత్కూరు గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు, రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం రూ.13.50 లక్షలతో నిర్మించిన కందులపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా జి.కొండూరులో కాలనీలోని మధ్య బజారులో రూ.15 లక్షలతో నిర్మించనున్న రజకుల కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.13.50 లక్షలతో ఎస్.టి ఏరియాలో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. జి.కొండూరులోని హిందూ శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో పులివాగుపై రూ.60 లక్షల డీఎంఎఫ్ నిధులతో నిర్మించనున్న వంతెనకు శంకుస్థాపన చేశారు. 12 అడుగుల వెడల్పుతో నిర్మించనున్న ఈ వంతెన పూర్తయితే శ్మశాన వాటికకు వెళ్లే ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా పినపాక, ఆత్కూరు, కందులపాడు, జి.కొండూరు ప్రాంతాల్లో మొత్తం రూ.1.67 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, సీసీ రోడ్లు, వంతెనల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పనులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. .

జి.కొండూరు మండలంలో రూ.1.67 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.

పాల్గొన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు,

జి.కొండూరు మండలంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రూ.1.67 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శంకుస్థాపనలు చేసి, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

తొలుత జి.కొండూరు మండలం పినపాక గ్రామంలోని ఎస్సీ ఏరియాలో రూ.25 లక్షల డీఎంఎఫ్ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవనానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు శంకుస్థాపన చేశారు.

ఆత్కూరు గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు, రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం రూ.13.50 లక్షలతో నిర్మించిన కందులపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు.

అదేవిధంగా జి.కొండూరులో కాలనీలోని మధ్య బజారులో రూ.15 లక్షలతో నిర్మించనున్న రజకుల కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.13.50 లక్షలతో ఎస్.టి ఏరియాలో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు.

జి.కొండూరులోని హిందూ శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో పులివాగుపై రూ.60 లక్షల డీఎంఎఫ్ నిధులతో నిర్మించనున్న వంతెనకు శంకుస్థాపన చేశారు. 12 అడుగుల వెడల్పుతో నిర్మించనున్న ఈ వంతెన పూర్తయితే శ్మశాన వాటికకు వెళ్లే ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ విధంగా పినపాక, ఆత్కూరు, కందులపాడు, జి.కొండూరు ప్రాంతాల్లో మొత్తం రూ.1.67 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, సీసీ రోడ్లు, వంతెనల నిర్మాణంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పనులను నాణ్యతతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.