మునుగనూరు టెలిఫోన్ కాలనీలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హయత్నగర్ పోలీసులు ‘గణేశ్ సురక్ష సంకల్ప్–2026’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హయత్నగర్ సీఐ శంకరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహిళల భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వాటి నివారణ చర్యలపై వివరించారు.
అలాగే వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని పోలీసులు కోరారు.
ప్రజల భద్రతకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని సీఐ శంకరయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు సౌజన్య భారతి పాల్గొన్నారు.
కమిటీ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
పోలీసుల సూచనలను పాటిస్తూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.



