కన్నపేగు మమకార మాధుర్యం నేను
అదే కన్న పేగు కుంగుబాటుకి కారణం నువ్వు
పురిటి గడ్డ రుణానుబంధ భావన నేను
అదే పురిటి గడ్డ పగ, ప్రతీకార భావనే నువ్వు
ప్రకృతిలోని పంచభూతాల వర్ణనే నేను
అదే ప్రకృతిలోని పంచభూతాలకు పీడ కలవే నువ్వు
అమ్మ ప్రేమను అందరికీ పంచేది నేను
అదే అమ్మ ప్రేమను ఆదిలోనే తుంచేది నువ్వు
నన్ను పట్టిన వాడు నరుల నాలుకుల పై నాట్యమాడును
నిన్ను పట్టిన వాడు చివరకు నీతోనే నశించును
నాది చరిత్ర—- నీది రక్త చరిత్ర —
కవి, రచయిత -కె. రెడ్డప్ప (భౌతిక శాస్త్ర అధ్యాపకులు, DSR హై స్కూల్, అల్లూరు )

