Wednesday, 23 September 2026
  • Home  
  • నవంబర్‌ 21లోగా వెలుగుమట్లను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దాలి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ఖమ్మం

నవంబర్‌ 21లోగా వెలుగుమట్లను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దాలి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత-జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ దివాకర టిఎస్, సీపీ సునీల్‌ దత్‌లతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. మంచుకొండ, బుగ్గవాగు ఎత్తిపోతల పథకాల పనులు వేగవంతం చేయాలని, మున్నేరు రక్షణ గోడ పనులు పూర్తి చేయాలని సూచించారు. కేబుల్‌ బ్రిడ్జి పనులను నవంబర్‌లోగా పూర్తి చేయాలని, అక్టోబర్‌ నుంచి జూన్‌ వరకు పనుల సీజన్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. రబీకి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సెప్టెంబర్‌ నెలాఖరులోగా సిద్ధం చేయాలని, ఆయిల్‌పామ్‌ సాగును పెంచాలని సూచించారు. వెలుగుమట్ల కాలనీని నవంబర్‌ 21లోగా అన్ని మౌలిక వసతులతో ఆదర్శ కాలనీగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఖమ్మం నగర విద్యుత్‌ అవసరాలకు పదేళ్ల ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఖాదర్‌ బాబా, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హన్మంతరావు, మున్సిపల్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, అదనపు కలెక్టర్‌ పి. శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.