Wednesday, 23 September 2026
  • Home  
  • లడ్డూ కల్తీపై రాజకీయాలు సరికాదు వైసిపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి
- కడప

లడ్డూ కల్తీపై రాజకీయాలు సరికాదు వైసిపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారాన్ని రాజకీయంగా ఉపయోగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి విమర్శించారు. మంగళవారం మండలంలోని భాకరాపేటలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తు, విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాజేశ్వరి రెడ్డి పేర్కొన్నారు. భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశాన్ని రాజకీయ విమర్శలకు, ఆరోపణలకు వేదికగా మార్చడం సరికాదన్నారు.లడ్డూ కల్తీ గత ప్రభుత్వ హయాంలో జరిగిందంటూ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.కేవలం ఆరోపణలు చేసినంత మాత్రాన అవి వాస్తవాలుగా మారవని, దర్యాప్తులో వెలుగులోకి వచ్చే ఆధారాలు, వాస్తవాల ఆధారంగానే ప్రజలకు విషయాలు తెలియజేయాలని అన్నారు. సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ విచారణలో వెలువడిన అంశాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రానికి సంబంధించిన విషయాల్లో రాజకీయ ప్రయోజనాల కంటే భక్తుల విశ్వాసం, ఆలయ పవిత్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై కూడా ఆమె విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలని కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని ఆమె పేర్కొన్నారు. అలాగే డీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు కూడా భవిష్యత్తులో వెలుగులోకి వస్తాయని రాజేశ్వరి రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.