ఖమ్మం జిల్లాలో నదులు, వాగుల్లో నీటి లభ్యత లేకపోవడంతో ఈసారి గణేష్ నిమజ్జనాలకు అధికారులు చెరువులను సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం మున్నేరు నదిలో నిమజ్జనానికి తరలివెళ్లే గణనాథులకు గాంధీచౌక్‌లో స్థంబాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వీడ్కోలు పలకడం గత 50 ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే ఈసారి దంసలపురం చెరువులో నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో తొలిసారిగా గాముస్తఫానగర్‌లో ప్రత్యేక వీడ్కోలు వేదికను ఏర్పాటు చేశారు. గణేష్ ఉత్సవ కమిటీలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీడ్కోలు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉత్సవ సమితి సభ్యులు పాల్గొననున్నారు.



