బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ ఆదివారం ఖమ్మం జిల్లాలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు బండ్ల రీగన్ ప్రతాప్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత నగరంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సేవా సంకల్ప అభియాన్లో భాగంగా పాత బస్టాండ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
బీజేపీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ సంస్థాగత బలోపేతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం నూతన పదాధికారులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా బండ్ల రీగన్ ప్రతాప్ మాట్లాడుతూ దళితులను ఓటు బ్యాంకుగా ఉపయోగించిన పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో బీజేపీ బలోపేతమే లక్ష్యమన్నారు.
కార్యక్రమంలో దాసి నాగరాజు, విష్ణు, బోయల వెంకట్, స్వర్ణఖర్, సుదర్శన్, ప్రతాప్, రాకేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.



