Wednesday, 23 September 2026
  • Home  
  • సాయిపేటలో మిస్సింగ్ అయిన ఇద్దరు బాలికలు 24 గంటల్లోనే సేఫ్ కడప నుంచి తిరుపతి.. అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లినట్లు గుర్తింపు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కదలికల గుర్తింపు
- కడప

సాయిపేటలో మిస్సింగ్ అయిన ఇద్దరు బాలికలు 24 గంటల్లోనే సేఫ్ కడప నుంచి తిరుపతి.. అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లినట్లు గుర్తింపు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కదలికల గుర్తింపు

సాయిపేటలో మిస్సింగ్ అయిన ఇద్దరు బాలికలు 24 గంటల్లోనే సేఫ్ కడప నుంచి తిరుపతి.. అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లినట్లు గుర్తింపు సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కదలికల గుర్తింపు పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 20 కడప జిల్లా: కడప నగరంలోని సాయిపేటలో మిస్సింగ్ అయిన ఇద్దరు బాలికలను కడప టూ టౌన్ పోలీసులు 24 గంటల్లోనే సురక్షితంగా ట్రేస్ చేశారు. బాలికలు కడప నుంచి తిరుపతికి, అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. టూ టౌన్ సీఐ శ్రీహరి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి బాలికల ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ బాలికల కదలికలను పోలీసులు గుర్తించారు. బాలికలు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక పోలీసు బృందం అక్కడికి వెళ్లి వారిని సురక్షితంగా ట్రేస్ చేసింది. అనంతరం బాలికలను కడపకు తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. మిస్సింగ్ కేసులో వేగంగా స్పందించి కేవలం 24 గంటల్లోనే బాలికల ఆచూకీ గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంపై టూ టౌన్ పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రత్యేక పోలీసు బృందం పనితీరును జిల్లా ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్ అభినందించారు. మిస్సింగ్ కేసుల్లో వెంటనే స్పందించి బాధితుల ఆచూకీని వేగంగా గుర్తించేందుకు పోలీసులు చేపడుతున్న చర్యలను ప్రశంసించారు. బాలికలు, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, మిస్సింగ్ ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

సాయిపేటలో మిస్సింగ్ అయిన ఇద్దరు బాలికలు 24 గంటల్లోనే సేఫ్

కడప నుంచి తిరుపతి.. అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లినట్లు గుర్తింపు

సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కదలికల గుర్తింపు

పున్నమి ప్రతినిధి
సెప్టెంబర్ 20
కడప జిల్లా:

కడప నగరంలోని సాయిపేటలో మిస్సింగ్ అయిన ఇద్దరు బాలికలను కడప టూ టౌన్ పోలీసులు 24 గంటల్లోనే సురక్షితంగా ట్రేస్ చేశారు. బాలికలు కడప నుంచి తిరుపతికి, అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

టూ టౌన్ సీఐ శ్రీహరి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి బాలికల ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ బాలికల కదలికలను పోలీసులు గుర్తించారు.

బాలికలు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక పోలీసు బృందం అక్కడికి వెళ్లి వారిని సురక్షితంగా ట్రేస్ చేసింది. అనంతరం బాలికలను కడపకు తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.

మిస్సింగ్ కేసులో వేగంగా స్పందించి కేవలం 24 గంటల్లోనే బాలికల ఆచూకీ గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంపై టూ టౌన్ పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

ప్రత్యేక పోలీసు బృందం పనితీరును జిల్లా ఎస్పీ నచ్చికేత్ విశ్వనాథ్ అభినందించారు. మిస్సింగ్ కేసుల్లో వెంటనే స్పందించి బాధితుల ఆచూకీని వేగంగా గుర్తించేందుకు పోలీసులు చేపడుతున్న చర్యలను ప్రశంసించారు.

బాలికలు, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, మిస్సింగ్ ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.