ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు: సర్వేపల్లి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడిగా దాసరి మహేంద్ర వర్మను నియమించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయనకు గుర్తింపు కార్డును అందజేశారు. పార్టీ కార్యక్రమాలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పబ్లిసిటీ వింగ్ కీలకంగా పనిచేయాలని సూచించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి మహేంద్ర వర్మ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

దాసరి మహేంద్ర వర్మకు కీలక బాధ్యత
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి) మనుబోలు: సర్వేపల్లి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షుడిగా దాసరి మహేంద్ర వర్మను నియమించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయనకు గుర్తింపు కార్డును అందజేశారు. పార్టీ కార్యక్రమాలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పబ్లిసిటీ వింగ్ కీలకంగా పనిచేయాలని సూచించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి మహేంద్ర వర్మ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

