Tuesday, 22 September 2026
  • Home  
  • మాధవరం-1లో గణనాథుడి ఊరేగింపు
- కడప

మాధవరం-1లో గణనాథుడి ఊరేగింపు

సిద్ధవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గ్రామంలోని శ్రీ భద్రావతి భావనారాయణ, శ్రీ సీతారాముల దేవస్థానంలో ఏడు రోజులపాటు పూజలందుకున్న వినాయకుడికి ఆదివారం భక్తిశ్రద్ధలతో నిమజ్జనం నిర్వహించారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లడ్డూ వేలంలో మేరువ కోదండరామయ్య రూ.84 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. 10 గ్రాముల వెండి నాణెం రూ.25 వేలకు నూకల నవీన్‌కుమార్, కలశం రూ.11,600లకు సోమా వెంకటేశు దక్కించుకున్నారు.అనంతరం బ్యాండు మేళాలు, మంగళవాయిద్యాలు, టపాసుల నడుమ వినాయకుడి ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా వినాయక విగ్రహాన్ని సిద్దవటం పెన్నానదికి తరలించి సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.