Tuesday, 22 September 2026
  • Home  
  • తాడేపల్లిగూడెంలో మల్లాది సూర్యనారాయణ సంస్మరణ సభ
- పశ్చిమ గోదావరి

తాడేపల్లిగూడెంలో మల్లాది సూర్యనారాయణ సంస్మరణ సభ

మల్లాది సూర్యనారాయణ గారు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కు చెందిన ప్రముఖ రంగస్థల కళాకారుడు, ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా పనిచేసి పదవి విరమణ పొందారు. నాటక రంగంపై మక్కువతో వందలాది మందికి నటనలో శిక్షణ ఇచ్చారు .ఆయన స్వయంగా నాటకాలు రచించి వాటికి దర్శకత్వం వహించారు. తాడేపల్లిగూడెంలో మల్లాది, రక్త మాంసాలు ధారపోసి, నాటక రంగానికి సేవలందించి, వృద్ధాప్యంలో ఎవరు ఆదరించక దీనావస్థ లో ఉన్న రంగస్థల కళాకారులును ఆదుకోవడమే ధ్యేయంగా నటరాజ కళాపీఠం స్థాపించి, నిరుపేద వృద్ధ కళాకారులకు ప్రతినెల ఆర్థిక సహాయం అందించారు .ఈ సేవా కార్యక్రమం ఎలాంటి అంతరాయం లేకుండా అవిచ్ఛిన్నంగా 300 నెలలకు పైగా అనగా 25 సంవత్సరాల పైగా సాగడం ఒక అరుదైన రికార్డు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా సీనియర్ కళాకారులను గుర్తించి, వారిని ఘనంగా సత్కరించడం, నాటక పోటీలు నిర్వహించడం ద్వారా నాటక రంగానికి ఈ పీఠం ఎనలేని సేవలందించింది .ఈయన ముఖ్యంగా సమాజంలోని రుగ్మతలను, మానవతా విలువలను ప్రతిబింబించేలా పలు నాటకాలను రచించారు. ఆయన దర్శకత్వం వహించిన నాటకాలు పశ్చిమగోదావరి జిల్లాలోనే కాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఎన్నో అవార్డులను అందుకున్నాయి .నాటక రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తింపుగా , కళారత్న పురస్కారం, సువర్ణ ఘంటా కంకణ సత్కారం, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు మరియు నాటక రంగంలో దర్శకత్వ భాగంలో జీవితకాల సాఫల్య పురస్కారాలను ఎన్నో అందుకున్నారు. ఈయన పబ్లిసిటీకి చాలా దూరంగా ఉండేవారు. ఆయన గురించి మల్లాది గారి ప్రియ శిష్యుడు ప్రముఖ సినీ నటుడు వై వి ఎన్ మూర్తి (నామాల మూర్తి) గారు మాట్లాడుతూ, మల్లాది గారు పేద కళాకారుల పాలిట పెన్నిధి, మానవతావాది, నిరాడంబరుడు అని కొనియాడారు. మేమిద్దరం వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ,నాటక రంగంలో ఆయన కృషిలో భాగస్వామి అయినందుకు నా నటన గురువుగా నా పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మా కాంబినేషన్లో ప్రదర్శించిన నాటికలు దిగ్విజయంగా ప్రదర్శించబడి, గురువుగారితో పాటు నాకు కూడా మంచి పేరు తెచ్చి పెట్టినవి అని చెబుతూ వారి ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతము అయ్యారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను అని అన్నారు. శ్రీ మల్లాది సూర్యనారాయణ గారి సంస్కరణ సభ 20.9. 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిర్వహించబడుతున్నది కావున ఈ కార్యక్రమమునకు ఆయన శిష్య బృందం మరియు నాటక కళాభిమానులు అందరూ విచ్చేసి వారి యొక్క సంస్మరణ సభను దిగ్విజయం చేయవలసినదిగా వారి శిష్య బృందం కోరారు.

మల్లాది సూర్యనారాయణ గారు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కు చెందిన ప్రముఖ రంగస్థల కళాకారుడు, ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయునిగా పనిచేసి పదవి విరమణ పొందారు. నాటక రంగంపై మక్కువతో వందలాది మందికి నటనలో శిక్షణ ఇచ్చారు .ఆయన స్వయంగా నాటకాలు రచించి వాటికి దర్శకత్వం వహించారు. తాడేపల్లిగూడెంలో మల్లాది, రక్త మాంసాలు ధారపోసి, నాటక రంగానికి సేవలందించి, వృద్ధాప్యంలో ఎవరు ఆదరించక దీనావస్థ లో ఉన్న రంగస్థల కళాకారులును ఆదుకోవడమే ధ్యేయంగా నటరాజ కళాపీఠం స్థాపించి, నిరుపేద వృద్ధ కళాకారులకు ప్రతినెల ఆర్థిక సహాయం అందించారు .ఈ సేవా కార్యక్రమం ఎలాంటి అంతరాయం లేకుండా అవిచ్ఛిన్నంగా 300 నెలలకు పైగా అనగా 25 సంవత్సరాల పైగా సాగడం ఒక అరుదైన రికార్డు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా సీనియర్ కళాకారులను గుర్తించి, వారిని ఘనంగా సత్కరించడం, నాటక పోటీలు నిర్వహించడం ద్వారా నాటక రంగానికి ఈ పీఠం ఎనలేని సేవలందించింది .ఈయన ముఖ్యంగా సమాజంలోని రుగ్మతలను, మానవతా విలువలను ప్రతిబింబించేలా పలు నాటకాలను రచించారు. ఆయన దర్శకత్వం వహించిన నాటకాలు పశ్చిమగోదావరి జిల్లాలోనే కాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఎన్నో అవార్డులను అందుకున్నాయి .నాటక రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తింపుగా ,
కళారత్న పురస్కారం, సువర్ణ ఘంటా కంకణ సత్కారం, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు మరియు నాటక రంగంలో దర్శకత్వ భాగంలో జీవితకాల సాఫల్య పురస్కారాలను ఎన్నో అందుకున్నారు. ఈయన పబ్లిసిటీకి చాలా దూరంగా ఉండేవారు. ఆయన గురించి మల్లాది గారి ప్రియ శిష్యుడు ప్రముఖ సినీ నటుడు వై వి ఎన్ మూర్తి (నామాల మూర్తి) గారు మాట్లాడుతూ, మల్లాది గారు పేద కళాకారుల పాలిట పెన్నిధి, మానవతావాది, నిరాడంబరుడు అని కొనియాడారు. మేమిద్దరం వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ,నాటక రంగంలో ఆయన కృషిలో భాగస్వామి అయినందుకు నా నటన గురువుగా నా పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మా కాంబినేషన్లో ప్రదర్శించిన నాటికలు దిగ్విజయంగా ప్రదర్శించబడి, గురువుగారితో పాటు నాకు కూడా మంచి పేరు తెచ్చి పెట్టినవి అని చెబుతూ వారి ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతము అయ్యారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను అని అన్నారు. శ్రీ మల్లాది సూర్యనారాయణ గారి సంస్కరణ సభ
20.9. 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిర్వహించబడుతున్నది కావున ఈ కార్యక్రమమునకు ఆయన శిష్య బృందం మరియు నాటక కళాభిమానులు అందరూ విచ్చేసి వారి యొక్క సంస్మరణ సభను దిగ్విజయం చేయవలసినదిగా వారి శిష్య బృందం కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.