Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సదరం సర్టిఫికెట్లు వెంటనే మంజూరు చేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సదరం సర్టిఫికెట్లు వెంటనే మంజూరు చేయాలి

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్‌ మండలంలో సదరం స్లాట్‌లు, సర్టిఫికెట్లు వెంటనే మంజూరు చేసి వికలాంగులను ఆదుకోవాలని సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
  • శనివారం సామ గంగయ్య అధ్యక్షతన నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సీపీఐ రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, మండల నాయకుడు తిప్పన ప్రసాద్ మాట్లాడారు.
  • సదరం సర్టిఫికెట్లు లేక చాలామంది వికలాంగులు, వృద్ధులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

చిట్వేల్‌ మండలంలో సదరం స్లాట్‌లు, సర్టిఫికెట్లు వెంటనే మంజూరు చేసి వికలాంగులను ఆదుకోవాలని సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం సామ గంగయ్య అధ్యక్షతన నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సీపీఐ రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, మండల నాయకుడు తిప్పన ప్రసాద్ మాట్లాడారు. సదరం సర్టిఫికెట్లు లేక చాలామంది వికలాంగులు, వృద్ధులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సర్టిఫికెట్ల జారీ ఆలస్యం కారణంగా పెన్షన్ దరఖాస్తు గడువులోగా ప్రక్రియ పూర్తి చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. అర్హులైన వారికి సదరం సర్టిఫికెట్లు త్వరగా మంజూరు చేయడంతో పాటు పెన్షన్ దరఖాస్తుల గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *