Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరులో ప్లాట్లు కొంటున్నారా..? నుడా అనుమతులపై అధికారుల పరిశీలన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వింజమూరులో ప్లాట్లు కొంటున్నారా..? నుడా అనుమతులపై అధికారుల పరిశీలన

వార్త ముఖ్యాంశాలు

  • వింజమూరు పట్టణ పరిధిలో నుడా అనుమతులు లేకుండా లేఅవుట్లు ఏర్పాటు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు పరిశీలన చేపట్టారు.
  • డీఎల్పీవో వెంకటరమణ, డిప్యూటీ ఎంపీడీవో రామారావు, ఏవోలు పట్టణంలోని పలు లేఅవుట్లను పరిశీలించి వివరాలు సేకరించారు.
  • పరిశీలనలో 4 లేఅవుట్లకు నుడా అనుమతులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

వింజమూరు పట్టణ పరిధిలో నుడా అనుమతులు లేకుండా లేఅవుట్లు ఏర్పాటు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు పరిశీలన చేపట్టారు. డీఎల్పీవో వెంకటరమణ, డిప్యూటీ ఎంపీడీవో రామారావు, ఏవోలు పట్టణంలోని పలు లేఅవుట్లను పరిశీలించి వివరాలు సేకరించారు. పరిశీలనలో 4 లేఅవుట్లకు నుడా అనుమతులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మరో 2 లేఅవుట్లకు అనుమతుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. అనుమతులు లేని మిగిలిన 22 లేఅవుట్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నుడా అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *