GCDO హేమలతను కలిసిన ఉమ్మడి ప్రకాశం జిల్లా కౌన్సిలర్లు
ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన జిల్లా కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు సమగ్ర శిక్ష కార్యాలయంలో GCDO హేమలతను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు తమ విధులకు సంబంధించిన పలు అంశాలను GCDO హేమలత దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలల్లో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ అందించడం, కౌన్సిలర్ల విధులు, ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు.
విద్యార్థుల మానసిక ఆరోగ్యం, కెరీర్ అభివృద్ధికి కౌన్సిలర్ల సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు అవసరమైన సహకారం, సమన్వయంపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన జిల్లా కెరీర్ & మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.





