Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

డిజిటల్ లావాదేవీలతో ఆర్థిక పారదర్శకత -ఏపీఎం ఆంజనేయులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
డిజిటల్ లావాదేవీలతో ఆర్థిక పారదర్శకత -ఏపీఎం ఆంజనేయులు

వేముల సెప్టెంబరు 19 పున్నమి న్యూస్ ప్రతినిధి: స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలను డిజిటల్ విధానంలో నిర్వహించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని వెలుగు– డీఆర్డీఏ ఏపీఎం ఆంజనేయులు తెలిపారు. వేముల శ్రీశక్తి భవన్లో శుక్రవారం గ్రామ సమాఖ్య అసిస్టెంట్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సభ్యులకు ఈ-నారీ, ఎంబీకే,మన డబ్బులు–మన లెక్కలు కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సంఘాల పుస్తకాలను సక్రమంగా నిర్వహిస్తూ, అన్ని ఆర్థిక లావాదేవీలను ఎంబీకే ద్వారా నమోదు చేయాలన్నారు. రుణాలను నిర్దేశిత ప్రయోజనాలకు వినియోగించేలా పర్యవేక్షించి, సోషల్ ఆడిట్ నిర్వహించాలని తెలిపారు. సంఘ సభ్యులు, సంఘాల వివరాలను లోకోస్లో నమోదు చేసి కట్అఫ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్లు హరి, గంగరాజు, జ్యోతి, జయపాల్, నాగేశ్వరి పాల్గొన్నారు.

డిజిటల్ లావాదేవీలతో ఆర్థిక పారదర్శకత -ఏపీఎం ఆంజనేయులు

డిజిటల్ లావాదేవీలతో ఆర్థిక పారదర్శకత -ఏపీఎం ఆంజనేయులు

డిజిటల్ లావాదేవీలతో ఆర్థిక పారదర్శకత -ఏపీఎం ఆంజనేయులు

డిజిటల్ లావాదేవీలతో ఆర్థిక పారదర్శకత -ఏపీఎం ఆంజనేయులు

డిజిటల్ లావాదేవీలతో ఆర్థిక పారదర్శకత -ఏపీఎం ఆంజనేయులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *