భైరవరం గ్రామంలోని శ్రీకృష్ణనగర్ కాలనీలో శుక్రవారం సాయంత్రం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుత్తలూరు ZPTC లెక్కల లక్ష్మీకాంతమ్మ, లెక్కల పెద్ద మాలకొండారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వారికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం మహిళలు ప్రత్యేకంగా కోలాటం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, యువత, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. అనంతరం వినాయక విగ్రహాన్ని శోభాయాత్రగా తీసుకెళ్లి నిమజ్జనం నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమజ్జనోత్సవం ప్రశాంతంగా, అత్యంత వైభవంగా కొనసాగింది.

భైరవరం శ్రీకృష్ణనగర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం