ఉప్పల్; నారపల్లి మహాలక్ష్మి కాలనీలో అవినాష్ టిఫిన్ సెంటర్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లుగా వినాయక చవితి సందర్భంగా స్నేహితులందరూ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రతి సంవత్సరం సుమారు 500 నుంచి 1000 మంది వరకు భక్తులకు అన్నదానం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వినాయక నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ప్రతిరోజూ అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
వినాయక నిమజ్జనం రోజున గణనాథుడిని ట్యాంక్‌బండ్ వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కిషోర్, ప్రేమ్, సాయి, ఆకాష్, సంజు, రామ్, మాధవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.



