ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతించింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడం ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలక పరిణామమని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. దానం నాగేందర్ 2023లో బీఆర్ఎస్ తరఫున గెలిచి, అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అంశంపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ తరఫున కేవియట్ దాఖలు చేయనున్నట్లు మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.

దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పును స్వాగతించిన బీజేపీ