ఆత్మకూరు సెప్టెంబర్ 17 (పున్నమి ప్రతినిధి )
తేది: 18-09-2026, శుక్రవారం
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఉదయం 10:00.గంటలకు:ఆత్మకూరులోని,వెస్ట్ ఎంపీపీఎస్ పాఠశాల ప్రాంగణంలో ₹28.30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ‘భవిత భవనం’ ప్రారంభిస్తారు.ఉదయం 10:15 గంటలకు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ₹53 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం ఎమ్మార్సీ. మండల విద్యాశాఖాధికారి (ఎమ్ ఈ ఓ) కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు.ఉదయం 10:30 గంటలకు:
మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్న ఆత్మకూరు మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొంటారు


