కాకినాడ – గండేపల్లి – పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 16 :
గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన సత్తి దుర్గా శ్రీనివాస్, పిల్లి గోవిందు, రామకుర్తి రాజమ్మల కు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 1,28,000 రూపాయల చెక్కుల ను కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ శనివారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు.ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో పేదవాడికి వైద్యం భారం కాకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన సీఎం సహాయనిధికి కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రాణం పోసిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి తక్షణ సాయం అందేలా చేస్తున్నామని తెలిపారు. ఉప్పలపాడు గ్రామంలో ముగ్గురు అనారోగ్యంతో దరఖాస్తు చేయగానే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చొరవతో వెంటనే చెక్కు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. అనంతరం గ్రామంలో వినాయక మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నవీన్.ఇంటి వద్దకే వచ్చి సహాయం అందించడం పట్ల లబ్ధిదారుల కుటుంబాలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే నెహ్రూ, జ్యోతుల నవీన్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడబాల భాస్కరరావు, అడబాల రామాంజనేయులు,జీను మణి బాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, జాస్తి వసంత్, బుర్రి సత్తిబాబు, రేఖ బుల్లి రాజు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, చెవా నరసింహమూర్తి, అడబాల సత్తిబాబు, మండల బిజెపి అధ్యక్షులు తోలాటి వెంకన్న, ఉప్పలపాడు జనసేన అధ్యక్షుడు తవటం నాగేంద్ర, తిరణాల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

పేదవాడి ఇంటికే సీఎం సాయం 1,28000 వేల చెక్కులు అందజేసిన జ్యోతుల నవీన్
కాకినాడ – గండేపల్లి – పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 16 : గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన సత్తి దుర్గా శ్రీనివాస్, పిల్లి గోవిందు, రామకుర్తి రాజమ్మల కు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 1,28,000 రూపాయల చెక్కుల ను కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ శనివారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు.ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో పేదవాడికి వైద్యం భారం కాకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన సీఎం సహాయనిధికి కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రాణం పోసిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి తక్షణ సాయం అందేలా చేస్తున్నామని తెలిపారు. ఉప్పలపాడు గ్రామంలో ముగ్గురు అనారోగ్యంతో దరఖాస్తు చేయగానే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చొరవతో వెంటనే చెక్కు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. అనంతరం గ్రామంలో వినాయక మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నవీన్.ఇంటి వద్దకే వచ్చి సహాయం అందించడం పట్ల లబ్ధిదారుల కుటుంబాలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే నెహ్రూ, జ్యోతుల నవీన్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అడబాల భాస్కరరావు, అడబాల రామాంజనేయులు,జీను మణి బాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, జాస్తి వసంత్, బుర్రి సత్తిబాబు, రేఖ బుల్లి రాజు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, చెవా నరసింహమూర్తి, అడబాల సత్తిబాబు, మండల బిజెపి అధ్యక్షులు తోలాటి వెంకన్న, ఉప్పలపాడు జనసేన అధ్యక్షుడు తవటం నాగేంద్ర, తిరణాల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

