శృంగవరపుకోట సబ్ డివిజన్లో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,సెప్టెంబర్ 15. పున్నమి ప్రతినిధి
ఎస్.కోట సబ్ డివిజన్ పరిధిలో ఇంజినీర్స్ డే వేడుకలను పి ఆర్ సబ్ డివిజన్ ( డి. ఈ. ఈ )స్వామి నాయుడు ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ రంగంలో సేవలందిస్తున్న సిబ్బందిని అభినందిస్తూ, సమాజ అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్రను కొనియాడారు.
వేడుకల్లో మండల ఇంజనీరింగ్ అధికారి బి.వి సత్యనారాయణ మరియు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొని ఇంజినీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగిందని నిర్వాహకులు తెలియజేశారు



