ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం ఎంఈఓ-2 తోట శ్రీనివాసులు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనా తీరును పరిశీలించారు. ఇంగ్లీష్, సోషల్ సబ్జెక్టుల్లో విద్యార్థులకు మరింత సులభంగా అర్థమయ్యేలా బోధనా మెలకువలను ఉపాధ్యాయులకు వివరించారు. అనంతరం పాఠశాలలోని రికార్డులను పరిశీలించి, పాఠశాల నిర్వహణకు సంబంధించి హెచ్‌ఎంకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడికను అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం హెచ్‌ఎంతో కలిసి ఎస్‌ఎంసీ నోటిఫికేషన్‌ను పాఠశాల నోటీస్ బోర్డుపై విడుదల చేశారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని ఎంఈఓ తోట శ్రీనివాసులు సూచించారు

ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎంఈఓ