మనుబోలు: నెల్లూరు జిల్లా మనుబోలు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం పశువుల సంత వేలం పాట ఉత్కంఠభరితంగా సాగింది. డిప్యూటీ ఎంపీడీవో గరుడయ్య, పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో పలువురు పోటీదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన వేలం చివరకు కోవూరుకు చెందిన సుబ్బారెడ్డి, మల్లికార్జున్రెడ్డి రూ.81,10,000కు పశువుల సంత హక్కులను దక్కించుకున్నారు. ఇంత భారీ మొత్తానికి వేలం పాట పలకడం మనుబోలు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. గతంతో పోలిస్తే ఈసారి వేలం ధర గణనీయంగా పెరగడంతో పంచాయతీకి ఆదాయం పెరిగే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

మనుబోలు పశువుల సంత వేలంలో రికార్డు ధర