ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు పంటలు వేయని రైతులకు స్వల్పకాలిక అపరాల విత్తనాలైన మినుములు, పెసలు, కంది విత్తనాలను సబ్సిడీపై అందించనున్నట్లు గుంటూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎన్. మోహన్రావు తెలిపారు. వట్టిచెరుకూరులో నిర్వహించిన ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సంప్రదించి విత్తనాలు పొందాలని సూచించారు. ప్రతి రైతు ఫార్మర్ ఐడీ కలిగి ఉండటంతో పాటు ఈ-క్రాప్ బుకింగ్, ఈ-కేవైసీ పూర్తి చేయాలని తెలిపారు. ఎరువులను శాస్త్రవేత్తల సూచన మేరకే వినియోగించాలని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో యూరియా, డీఏపీ నిల్వలను అధికారులు పరిశీలించారు.





