Monday, 14 September 2026
  • Home  
  • కొవ్వూరు: గుండెపోటుతో జనసేన నేత మృతి
- తూర్పు గోదావరి

కొవ్వూరు: గుండెపోటుతో జనసేన నేత మృతి

తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి) కొవ్వూరు: కొవ్వూరు మండలం పెనకనమెట్టకు చెందిన జనసేన సీనియర్ నాయకుడు అచ్యుతరాముడు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర విషాదానికి గురయ్యారు. అచ్యుతరాముడు జనసేన పార్టీ పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని స్థానిక నాయకులు తెలిపారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు వీరాభిమానిగా ఆయన కొవ్వూరు నియోజకవర్గంలో అందరికీ సుపరిచితుడిగా ఉన్నారు. ఆయన మరణం జనసేన పార్టీకి తీరని లోటని కొవ్వూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు సుంకర సత్తిబాబు తెలిపారు. అచ్యుతరాముడి మృతి పట్ల నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అచ్యుతరాముడి మృతితో జనసేన శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీ కోసం ఆయన అందించిన సేవలను నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా సెప్టెంబర్ 13 (పున్నమి ప్రతినిధి)
కొవ్వూరు: కొవ్వూరు మండలం పెనకనమెట్టకు చెందిన జనసేన సీనియర్ నాయకుడు అచ్యుతరాముడు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర విషాదానికి గురయ్యారు.

అచ్యుతరాముడు జనసేన పార్టీ పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని స్థానిక నాయకులు తెలిపారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు వీరాభిమానిగా ఆయన కొవ్వూరు నియోజకవర్గంలో అందరికీ సుపరిచితుడిగా ఉన్నారు.

ఆయన మరణం జనసేన పార్టీకి తీరని లోటని కొవ్వూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు సుంకర సత్తిబాబు తెలిపారు. అచ్యుతరాముడి మృతి పట్ల నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అచ్యుతరాముడి మృతితో జనసేన శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీ కోసం ఆయన అందించిన సేవలను నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.