సంగం మండలం చెన్నవరప్పాడు గ్రామంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. గ్రామంలో ఒకే రోజు మూడు ముఖ్యమైన రహదారి పనులకు శంకుస్థాపన జరగడంతో గ్రామంలో అభివృద్ధి జాతర నెలకొంది.టీడీపీ సీనియర్ నాయకులు పావళ్ళ రత్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మూడు రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యం, రైతుల వ్యవసాయ అవసరాలు, స్మశాన వాటికకు రాకపోకల కోసం ఈ రహదారులు ఉపయోగపడనున్నాయి.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులురెడ్డి, సంగం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు పాల్గొని రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు సహకరించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న టీడీపీ సీనియర్ నాయకులు పావళ్ళ రత్నయ్యకు గ్రామ ప్రజలు, యువత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

చెన్నవరప్పాడులో అభివృద్ధి జాతర.. ఒకే రోజు మూడు రోడ్లకు శంకుస్థాపన