నంద్యాల: పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్లు, కాలనీలు, ప్రధాన కూడళ్లలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, డ్రైనేజీలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.పట్టణ పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, అధికారులు-సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు విక్రమ్, శభరిష్, శానిటేషన్ సూపర్వైజర్లు లక్ష్మీనారాయణ, శివప్రసాద్ రెడ్డి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

పారిశుధ్యంపై మున్సిపల్ కమిషనర్ శేషన్న ప్రత్యేక నిఘా