భూపాలపల్లి: భూపాలపల్లి ఎక్సైజ్ సీఐగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ను తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం పూల బొకేను అందజేసి నూతన బాధ్యతల్లో ఆయన విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా శ్రీపతి ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ, భూపాలపల్లి ఎక్సైజ్ సీఐగా బాధ్యతలు చేపట్టిన తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మామిండ్ల శ్రీనివాస్ గౌడ్, కోటగిరి సతీష్ గౌడ్, నేరేడుపల్లి సర్పంచ్ శ్రీపతి తిరుపతి గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ తాళ్లపల్లి సురేందర్ గౌడ్, ముత్యాల రాజబాబు గౌడ్, తాళ్లపల్లి సదానందం గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, శ్రీపతి అశోక్ గౌడ్, ముత్యాల రోషన్ గౌడ్, బత్తిని సాయి గౌడ్, రామకృష్ణ గౌడ్, బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


