Sunday, 13 September 2026
  • Home  
  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఉదయగిరి వుడెన్ కట్లరీ సెంటర్‌కు రూ.12 లక్షల నిధులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఉదయగిరి వుడెన్ కట్లరీ సెంటర్‌కు రూ.12 లక్షల నిధులు

ఉదయగిరి ప్రాంత హస్తకళాకారుల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. ఆయన సూచనల మేరకు జనసేన రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఉదయగిరి వుడెన్ కట్లరీ సెంటర్ అభివృద్ధి కోసం రూ.12 లక్షల నిధులను మంజూరు చేయించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఉదయగిరి వుడెన్ కట్లరీ సెంటర్‌ను సందర్శించి, అక్కడి హస్తకళాకారులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. అనంతరం సెంటర్ నిర్వాహకులు జకీర్ హుస్సేన్, ఆయన తల్లిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జకీర్ హుస్సేన్ ఎంపీ లింగమనేని రమేష్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వుడెన్ కట్లరీ సెంటర్‌లో తయారు చేసిన చెక్క వస్తువులతో కూడిన ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌ను అందజేశారు. ఉదయగిరి వుడెన్ కట్లరీ సెంటర్‌పై ఆధారపడి సుమారు 350 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మంజూరైన రూ.12 లక్షల నిధులను సెంటర్‌కు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి, ప్రహరీ గోడ నిర్మాణం, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్ తదితర సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నారు. హస్తకళాకారుల సమస్యలను పరిష్కరించి, వారి జీవనోపాధికి మరింత భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. హస్తకళలకు ప్రోత్సాహం అందించడం ద్వారా స్థానిక కళాకారుల కుటుంబాలకు మరింత మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఉదయగిరి ప్రాంత హస్తకళాకారుల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. ఆయన సూచనల మేరకు జనసేన రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఉదయగిరి వుడెన్ కట్లరీ సెంటర్ అభివృద్ధి కోసం రూ.12 లక్షల నిధులను మంజూరు చేయించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఉదయగిరి వుడెన్ కట్లరీ సెంటర్‌ను సందర్శించి, అక్కడి హస్తకళాకారులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. అనంతరం సెంటర్ నిర్వాహకులు జకీర్ హుస్సేన్, ఆయన తల్లిని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జకీర్ హుస్సేన్ ఎంపీ లింగమనేని రమేష్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వుడెన్ కట్లరీ సెంటర్‌లో తయారు చేసిన చెక్క వస్తువులతో కూడిన ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌ను అందజేశారు.
ఉదయగిరి వుడెన్ కట్లరీ సెంటర్‌పై ఆధారపడి సుమారు 350 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మంజూరైన రూ.12 లక్షల నిధులను సెంటర్‌కు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి, ప్రహరీ గోడ నిర్మాణం, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్ తదితర సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నారు.
హస్తకళాకారుల సమస్యలను పరిష్కరించి, వారి జీవనోపాధికి మరింత భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. హస్తకళలకు ప్రోత్సాహం అందించడం ద్వారా స్థానిక కళాకారుల కుటుంబాలకు మరింత మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.