బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు ఎమ్. స్వర్ణాకర్ తండ్రికి బ్రెయిన్ సర్జరీ జరగడంతో ఖమ్మం నెహ్రూ నగర్లోని శ్రీ రక్ష హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ తెలంగాణ కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, వాళ్ల రమేష్ ఆసుపత్రికి చేరుకుని స్వర్ణాకర్ తండ్రిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి అధినేత, బీజేపీ తెలంగాణ కార్యవర్గ సభ్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లును కలిసి చికిత్స వివరాలు, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, స్వర్ణాకర్ తండ్రి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.



