Friday, 11 September 2026
  • Home  
  • మైలవరం నియోజవర్గం పేదల వైద్యానికి రూ 25 19 కోట్లు ఆర్థిక సహాయం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ చెక్కులు పంపిణీ పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా గారు చెప్పులు పంపిణీ
- ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం నియోజవర్గం పేదల వైద్యానికి రూ 25 19 కోట్లు ఆర్థిక సహాయం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ చెక్కులు పంపిణీ పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా గారు చెప్పులు పంపిణీ

మైలవరం నియోజకవర్గంలో పేదల వైద్యానికి రూ.25.19 కోట్ల ఆర్థిక సాయం. -ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు వెల్లడి. 1,957 మందికి రూ.11.71 కోట్ల ఎల్.ఓ.సీలు. 744 మందికి రూ.13.48 కోట్ల సీఎంఆర్ఎఫ్ రీయింబర్స్‌మెంట్ చెక్కులు. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 10/09/2026. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మైలవరం నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.25.19 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి కింద 1,957 మందికి రూ.11,71,00,811 విలువైన ఎల్.ఓ.సీలు మంజూరయ్యాయని తెలిపారు. అదేవిధంగా చికిత్స కోసం ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి 744 మందికి రూ.13,48,25,986 విలువైన సీఎంఆర్ఎఫ్ రీయింబర్స్‌మెంట్ చెక్కులు చెల్లించినట్లు వెల్లడించారు. ఈ రెండు విభాగాల్లో కలిపి ఇప్పటివరకు రూ.25,19,26,797 మేర ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎల్.ఓ.సీలు, సీఎంఆర్ఎఫ్ రీయింబర్స్‌మెంట్ చెక్కులను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ.. పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గిస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మైలవరం నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మైలవరం నియోజకవర్గానికి ఈ స్థాయిలో ఆర్థిక సహాయం అందుతున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని, అవసరమైన సందర్భాల్లో సీఎంఆర్ఎఫ్‌కు సంబంధించి తగిన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తన కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు పేదల వైద్యసేవల నిమిత్తం రూ.25.19 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం అందడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య భరోసాకు నిదర్శనమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు పేర్కొన్నారు.

మైలవరం నియోజకవర్గంలో పేదల వైద్యానికి రూ.25.19 కోట్ల ఆర్థిక సాయం.

-ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు వెల్లడి.

1,957 మందికి రూ.11.71 కోట్ల ఎల్.ఓ.సీలు.

744 మందికి రూ.13.48 కోట్ల సీఎంఆర్ఎఫ్ రీయింబర్స్‌మెంట్ చెక్కులు.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 10/09/2026.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మైలవరం నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రూ.25.19 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు మైలవరం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు తెలిపారు.

ముఖ్యమంత్రి సహాయనిధి కింద 1,957 మందికి రూ.11,71,00,811 విలువైన ఎల్.ఓ.సీలు మంజూరయ్యాయని తెలిపారు. అదేవిధంగా చికిత్స కోసం ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తానికి సంబంధించి 744 మందికి రూ.13,48,25,986 విలువైన సీఎంఆర్ఎఫ్ రీయింబర్స్‌మెంట్ చెక్కులు చెల్లించినట్లు వెల్లడించారు.

ఈ రెండు విభాగాల్లో కలిపి ఇప్పటివరకు రూ.25,19,26,797 మేర ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు పేర్కొన్నారు.

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎల్.ఓ.సీలు, సీఎంఆర్ఎఫ్ రీయింబర్స్‌మెంట్ చెక్కులను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ.. పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గిస్తూ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మైలవరం నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.

“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మైలవరం నియోజకవర్గానికి ఈ స్థాయిలో ఆర్థిక సహాయం అందుతున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని, అవసరమైన సందర్భాల్లో సీఎంఆర్ఎఫ్‌కు సంబంధించి తగిన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తన కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.

మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు పేదల వైద్యసేవల నిమిత్తం రూ.25.19 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం అందడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య భరోసాకు నిదర్శనమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.