ఉదయగిరి, సెప్టెంబర్ 10: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టై మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఉదయగిరి బస్టాండ్ సర్కిల్లో టీడీపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులపాటు జైలులో ఉంచినా ఆయన వెనక్కి తగ్గలేదన్నారు. ప్రజల అండతో తిరిగి అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆయన పోరాట పటిమకు నిదర్శనమన్నారు. ఆయన దూరదృష్టి, విజనరీ నాయకత్వం, రాష్ట్ర అభివృద్ధిపై అంకితభావం ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు.

నిజం గెలిచింది.. న్యాయం నిలిచింది చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. ఉదయగిరిలో టీడీపీ కొవ్వొత్తుల ర్యాలీ