వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో
గ్రామపంచాయతీ పాలకవర్గం చేత క్రీడా దుస్తుల పంపిణీ.
ఈరోజు పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల చేతుల మీదుగా 35 వేల రూపాయల విలువగల క్రీడా దుస్తులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పడగల విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెంట జలంధర్ మరియు గ్రామ సర్పంచ్ నల్ల రాజు ఉపసర్పంచ్ గైని నరేందర్ మరియు వార్డు సభ్యులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


