Tuesday, 8 September 2026
  • Home  
  • సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ-లబ్ధిదారులకు అండగా బొజ్జల బృందమ్మ
- తిరుపతి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ-లబ్ధిదారులకు అండగా బొజ్జల బృందమ్మ

శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 08, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ చేతుల మీదుగా శ్రీకాళహస్తి టౌన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధి, భాస్కర్ పేట, ముత్తరాశిపాలెం, బస్టాండ్ సమీపంలోని పెద్ద మసీదు ప్రాంతం, పూసల వీధి, రాజీవ్ నగర్, బిపి అగ్రహారం, శ్రీరామ నగర్ కాలనీలలో ఆమె స్వయంగా పర్యటించి, లబ్ధిదారులకు ఈ ఆర్థిక సహాయక చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని, సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని ఆమె వెల్లడించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ కుమార్ నాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్, శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి సభ్యులు వాకు చెర్ల గుర్రప్ప శెట్టి, గోపి, శ్రీకాళహస్తి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బాలు ఢిల్లీ బాబుతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.