భూ భారతి చట్టంలోని 22A నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న ఖమ్మం ధర్నా చౌక్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా దీక్షను జయప్రదం చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం ఖమ్మం అర్బన్ పట్టణ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 22A కారణంగా భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. పట్టణ అధ్యక్షులు వాకదాని రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఆచంటి కోటేశ్వరరావు, అల్లిక అంజయ్య, వేల్పుల సుధాకర్, పీవి చంద్ర శేఖర్, వాళ్లలా రమేష్, కంపసాని అజయ్ తదితరులు పాల్గొన్నారు.



