భూ భారతి చట్టంలోని 22A నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా దీక్షకు సంబంధించి పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ 22A రద్దు డిమాండ్‌తో చేపట్టే ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భూక్యా శ్యాం, సోమగాని ఎల్లారావు గౌడ్, గుత్త వెంకటేశ్వర్లు, మండదపు సుబ్బారావు, మంద సరస్వతి, ఆర్వీఎస్ యాదవ్, ఆచంటి కోటేశ్వరరావు, ధనియాకుల వెంకట్ నారాయణ, శ్రీరామనేని మణి, సాయిరాం, రవి రాథోడ్, డీకొండ శ్యాం, కందుల శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



