హైదరాబాద్/ ఖమ్మం
బీఆర్ఎస్ శాసన మండలి సభ్యుడు తాత మధును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను తాత మధు అసభ్య పదజాలంతో దూషించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో తాత మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాజకీయ కక్షతోనే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.



