నగరము లోని నెహ్రూ నగర్‌లో గంజాయి రవాణా చేస్తున్న ఓ యువకుడిని ఖమ్మం టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించి పోలీసులను చూసి పారిపోతున్న జాహిర్‌పురకు చెందిన ఓ యువకుడిని పోలీసులు పట్టుకున్నట్లు టూ టౌన్ ఎస్‌ఐ రమేష్ తెలిపారు. అతడిని తనిఖీ చేయగా రూ.19 వేల విలువైన 380 గ్రాముల గంజాయితో పాటు ఒక సెల్‌ఫోన్ లభించినట్లు చెప్పారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమేష్ వెల్లడించారు. యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.



