భారతీయ జనతా పార్టీ – వరదయ్యపాలెం మండల సమావేశ తీర్మానాలు
తేదీ: 06-09-2026, వేదిక: KBG కళ్యాణ మండపం, ఇంద్రానగర్ పంచాయతీ
ఈరోజు జరిగిన వరదయ్యపాలెం మండల నెలవారీ సమావేశం మండల అధ్యక్షులు శ్రీ K. దిలీప్ రాయల్ గారి అధ్యక్షతన, ఓబీసీ మోర్చా జిల్లా దేవాంగ సంఘం అధ్యక్షులు శ్రీ K.B. గురుదేవ్ గారి సమక్షంలో జరిగింది.
సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాలు:
1. గత కార్యక్రమాల సమీక్ష: గత నెలలో జరిగిన కార్యక్రమాలపై, సమావేశ తీర్మానాల అమలుపై సమీక్ష.
2. మండల పర్యటనపై సమీక్ష: మండల అధ్యక్షులు చేపట్టిన మండల పర్యటన వివరాలు, బూత్ ల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్ష.
3. విశాఖపట్నం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశ సారాంశం: ఇటీవల విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో జాతీయ అధ్యక్షులు నితిన్ నబియాన్ గారు మరియు రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు, ప్రసంగ సారాంశంపై చర్చ.
4. 100% శక్తి కేంద్ర యోజన: 100% శక్తి కేంద్రాల ఏర్పాటు మరియు ప్రముఖ్ ల నియామకం ప్రతి బూత్ స్థాయిలో పకడ్బందీగా జరిగేలా చూడాలని తీర్మానం.
5. మన ఊరు – మన జెండా: “మన ఊరు – మన జెండా” కార్యక్రమ పురోగతిపై చర్చ, ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేయాలని నిర్ణయం.
6. ప్రధాని మోదీ గారి జన్మదిన వేడుకలు: సెప్టెంబర్ 17న జరగనున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించాలని చర్చ.
ఈ సందర్భంగా మాజీ మండల అధ్యక్షులు శ్రీ వేలూరు పురుషోత్తం గారు మాట్లాడుతూ రాబోయే స్థానిక లోకల్ బాడీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉన్నామని, పార్టీ ఎదుగుదలకు అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలిపారు. విశ్వగురు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన వేడుకలు వరదయ్యపాలెం మండలంలో ఘనంగా నిర్వహిస్తామని, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులను కూడా వేడుకలకు ఆహ్వానిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు శుభ రత్నమ్మ, డీవీఎంసీ మెంబర్ గుత్తి త్యాగరాజు, మండల ఉపాధ్యక్షులు బొగ్గల సుబ్రమణ్యం, మైనార్టీ అధ్యక్షులు ఎం. జయంతి కుమార్, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు ఎల్ల అన్వేష్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బొగ్గల ఏసు యువ మోర్చా మాజీ మండల అధ్యక్షులు బొర్రా మధు, కన్నన్ మరియు మండల ముఖ్య నాయకులు, మహిళా మోర్చా, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.
ఇట్లు,
K. దిలీప్ రాయల్
………………………………………………………………………………………………………………………………………………………………
✍️మహ్మద్ షఫివుల్లా
పున్నమి దినపత్రిక
సత్యవేడు నియోజక వర్గం
ఇంచార్జ్


